calender_icon.png 16 June, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాటల ప్రయాణంలో తమ్ముడు

16-06-2025 12:49:13 AM

నితిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషించారు. ఇందులో లయ, నితిన్ అక్కాతమ్ముళ్లుగా నటించారు. జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

అక్క ఇచ్చిన మాటను నిలబెట్టే తమ్ముడి కథతో ఈ సినిమా రూపొందినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఇలా ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మూవీ టీమ్ మరో అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘భూ అంటే భూతం..’ రిలీజ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ నెల 17న ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ పాటను అజనీష్ లోకనాథ్ కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి ఆకట్టుకునేలా పాడారని, తన మేనకోడలిని ఆడిస్తూ కథానాయకుడు పాడే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించినట్టు పేర్కొన్నారు. ఈ చిత్రానికి బ్యానర్: శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్; సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్; సంగీతం: అజనీష్ లోకనాథ్; ఎడిటర్: ప్రవీణ్ పూడి; నిర్మాత: దిల్ రాజు, శిరీష్; రచనా-దర్శకత్వం: శ్రీరామ్ వేణు.