2 June, 2026 | 6:37 PM

Breaking News

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ   •   జవహర్‌నగర్‌లో భారీ ఎత్తున మానవహారం   •   భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •   ఘనంగా అవతరణ వేడుక   •   పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు   •   పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు   •   అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు   •  

కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు

02-06-2026 06:02 PM

జైనూర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్‌లో జరిగిన ప్రభుత్వ సభలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ప్రోటోకాల్ కల్పించలేదని, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాజకీయ సభగా మార్చి, ప్రజలు ఎన్నుకున్న ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేను వేదికపై అవమానించారని వారు విమర్శించారు. నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, హామీలపై ప్రశ్నలు వస్తాయనే భయంతోనే ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం అంటే ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని వారు వ్యాఖ్యానించారు.