అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు
- తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరుల ఆకాంక్షల సాధనకై పోరాటమే వారికి నిజమైన నివాళులు
- పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఉద్యమకారులను ప్రక్కన పెట్టిన (టిఆర్ఎస్) బీ ఆర్ ఎస్
- అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
- బోధన్ పట్టణంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో ఆమర వీరులకు నివాళులర్పించారు
బోధన్,(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా మంగళవారం రోజున వద్ద గల తెలంగాణ దీక్ష స్థల్ లో గల తెలంగాణ ఉద్యమ సాధన అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ ఆధ్వర్యంలో పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ప్రజా పంథా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కై కోసం పోరాడారో ఆ ఆకాంక్షలను అధికారంలోకి వచ్చిన పాలకులు అమలు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పాలించిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే గాక ఉద్యమకారులను కూడా గుర్తించలేదని బి. మల్లేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం. పింఛన్లను ఇస్తాం అని దరఖాస్తులను స్వీకరించినప్పటికీ ఇప్పటికీ పురోగతి లేదని అన్నారు. ముఖ్యంగా మౌలిక సమస్యలు అయినటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పన కై ఉద్యోగాలు, రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించడం, ఉచిత విద్య, వైద్యం లాంటివి కల్పించడంలో కూడా ఆలనాపరమైన అడుగులు ముందుకు పడడం లేదని వీటికై కృషి చేయాలన్నారు. వీటి సాధనకై పోరాటాలు చేయడమే అమరులకు నిజమైన నివాళులు అన్నారు.






