మున్సిపాలిటీ ముందు బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్ల ధర్నా
31-08-2026 07:27 PM
ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ(Atmakur Municipality)లో అన్ని వార్డులకు సమానంగా అభివృద్ధి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కౌన్సిలర్లు సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గతంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసి వార్డులకు కేటాయించారని, ప్రస్తుతం వచ్చిన రూ.7 కోట్ల నిధుల్లో 3, 4, 6 వార్డులకు నిధులు కేటాయించలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రతిపక్ష వార్డుల పట్ల వివక్ష చూపకుండా అన్ని వార్డుల అభివృద్ధికి సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు జిందే జ్యోతి, పుల్లరి భరత్, చెట్ల లలిత, అల్లి శంకరమ్మలకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.






