31 August, 2026 | 8:40 PM

పులి రక్షణపై అటవీ శాఖ అధికారుల ప్రత్యేక శ్రద్ధ

31-08-2026 07:36 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ రేంజి పరిధిలో పులి సంచరిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అందులో భాగంగానే అధికారులు పులి అడవిలో నుండి రోడ్డు దాటే ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ బోర్డులను ఏర్పాటు చేయడంతో ప్రజల సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పులి సంచారం గురించి తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు అడవిలో ఏర్పాటు చేయడం జరిగింది. 

అప్రమత్తంగా ఉండండి

అడవి సమీపంలోని పంట చేలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. రాత్రిపూట అడవి వైపు వెళ్లవద్దని అంతేగాక పశువులు మేపేందుకు అడవి లోపలికి వెళ్లకూడదని ప్రజలను చైతన్యం చేస్తున్నారు. పులికి రక్షణగా ఉండాలని హాని తలపెట్టవద్దని గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. పొలాల చెట్టు విద్యుత్ కంచెలు ఉంటే తొలగించాలని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పులి రక్షణ పైన అధికారులు చేపడుతున్న చర్యల వల్ల పులులు ప్రశాంతంగా సంచరించే ఆస్కారం ఉంది.