24 May, 2026 | 12:40 AM

‘బండి’ని ఓడించేందుకు బీఆర్‌ఎస్, పొన్నం కుమ్మక్కు

19-04-2024 01:52 AM

బీజేపీ నేతలు ఎస్ కుమార్, సంగప్ప, గుగ్గిళ్ల 

కరీంనగర్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ని ఓడించేందుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అవుతున్నారని బీజేపీ నేతలు ఎస్ కుమార్, గుగ్గిళ్ల రమేశ్, జే సంగప్ప ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎంపీ క్యాంప్ కార్యాలయం లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేతలో అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతున్నాని మండిపడ్డారు. బీజేపీకి లిక్కర్ స్కాం నిందితుడు వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి రూ.500 కోట్ల విలు వైన ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇవ్వగానే బెయిల్ వచ్చిందని మంత్రి పొన్నం వ్యాఖ్యలు చేయ డం కేవలం అవివేకమని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రోరల్ బాండ్స్‌కు, బెయిల్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు కుమ్మరి శంకర్, కరండ్ల మధుకర్, రమణారెడ్డి, అజయ్‌వర్మ పాల్గొన్నారు.