రైతులు రాలిపోతున్నా చలనం లేదా?
- వ్యవస్థలు కుప్పకూలాయి
- ఇంకెన్ని చావులు కావాలి?
- మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, ధాన్యం కుప్పల మీదే రైతన్నలు కుప్ప కూలుతు న్నా, రాలిపోతున్నా ప్రభుత్వానికి చలనం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అన్నదాతల చావులను చూ సి ఆనందిస్తున్నవా ముఖ్యమంత్రి? కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండల్లో రైతుల గుండెలు ఆగిపోతున్నా కనికరం కలగడం లేదా ఈ కర్కశ ప్రభుత్వానికి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల మరణాలపై శనివా రం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు కుప్ప కూలాయన్నారు. పంటలు కొనకుండా ఇంకెంత కాలం రైతులను యాతన పెడతారు?, ఇంకె న్ని చావులు కావాలి, ఇంకెన్ని కు టుంబాలు రోడ్డున పడాలి? అని ప్రశ్నించారు. దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవ ర్తించడం ఆ పాలన్నారు. ఇకనైనా సోయి తె చ్చుకొని కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలుపై చిత్త శు ద్ధితో చర్చించాలని, పంట కొనుగోళ్లను పూ ర్తి చేసి రైతన్నల తిప్పలు తప్పించాలన్నారు.






