24 May, 2026 | 1:27 AM

హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

19-04-2024 01:51 AM

l కిషన్‌రెడ్డి నామినేషన్‌కు  అతిథిగా రాక

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన గురువారం నగరానికి వచ్చారు. విమానాశ్రయంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆయనకు స్వాగతం పలికారు.