29 April, 2026 | 10:53 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

కొత్తగూడెం, గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలి

07-03-2026 01:14 AM

కొత్తగూడెం గ్రామ అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్‌ఎస్ శ్రేణుల అర్ధనగ్న ప్రదర్శన.

తుంగతుర్తి, మార్చి 6: మండల పరిధిలోని కొత్తగూడెం, గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి అర్ధనగ్న.. ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ..గత కేసీఆర్ ప్రభుత్వం లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రత్తిపాధనలో రోడ్డు మంజూరు అయిందని తెలిపారు.

ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేల్ హడావుడిగా శంకస్థాపన చేసి రెండేళ్లయిన ఇంతవరకు పనులు ప్రారంభించక పోవడం శోచనీయమన్నారు. అదేవిధంగా మండల కేంద్రం నుండి  వెంపటి.. తూర్పుగూడెం, వెంపటి.. బంధారామారం.. గుండెపురి. బండరామారం గ్రామాల మధ్య రోడ్లను వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మేడుదుల రమేష్, జిల్లా నాయకులు జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం యాదవ్, ఉపసర్పంచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.