29 April, 2026 | 9:23 PM

Breaking News

పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •   పదిలో మెరిసిన జవహర్ నగర్ పేదింటి ఆణిముత్యాలు   •   పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత   •   విధి నిర్వహణలో అలుపెరుగని శ్రామికుడికి విరామం   •   జిల్లా ద్వితీయ స్థానంలో మేకల జ్ఞానేశ్వరి   •   పదవ తరగతి ఫలితాల్లో కేజీవీబీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ   •   ఖానాపూర్‌లో కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థుల విజయపరంపర   •   డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే యువత భవిష్యత్తు సురక్షితం   •  

కృష్ణయ్య మృతి పార్టీకి తీరని లోటు

07-03-2026 01:13 AM

రమావత్ రవీంద్ర కుమార్ 

దేవరకొండ, మార్చి 6 : కృష్ణయ్య మృతి పార్టీకి తీరని లోటు బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం పీఏ పల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకులు నేర్లపల్లి కృష్ణయ్య మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కృష్ణయ్య కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణయ్య కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటానని ఆయన తెలిపారు. కృష్ణయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు. ఆయన వెంట పలువురు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు  వల్లపు రెడ్డితదితరులు ఉన్నారు.