02-11-2025 12:12:28 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం పార్టీ సీనియర్ నాయకులు రంగంలోకి దిగి, వినూత్న రీతుల్లో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. శనివారం జరిగిన ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లగా, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మహిళా నేతలతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
ప్రచారంలో భాగంగా వెంగళరావునగర్ డివిజన్‌లోని మధురానగర్‌లో పర్యటించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, అక్కడి ఓ సెలూన్‌లో ఓ యువకుడికి స్వయంగా కత్తెర చేతబట్టి హెయిర్ కట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడు తూ ప్రజల మనిషిగా, మీలో ఒకరిగా ఉండే మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
మరోవైపు, షేక్‌పేట డివిజన్‌లోని అంబేద్కర్ నగర్, బాలాజీ నగర్ కాలనీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగం టి సునీత విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు మెదక్ మాజీ ఎమ్మె ల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఇతర మహిళా నేతలు ఇంటిం టా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యా రంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. దివం గత నేత మాగంటి గోపినాథ్ సేవలను ప్రజలకు గుర్తు చేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించడానికి సునీతకు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.