02-11-2025 12:10:05 AM
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డే హోంమంత్రిగా ఉన్న కూడా రాష్ర్టంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్ర వారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓ దళిత మహిళపై అత్యాచారం జరిగితే.. హోం మంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు.
మహిళలపై నేరాలు పెరుగుతున్నా హోంమంత్రిగా రేవంత్ రెడ్డ్ సరైన సమీక్షలు చేయడం లేదని, నేషనల్ హైవే పక్కనే అత్యాచారం జరిగినా కనీసం ఆరా తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. మున్సిపల్ మంత్రిగా ఉన్న ఆయనే హైదరాబాద్‌లో చెత్త సేకరణ కూడా సరిగా లేదని ఈ మధ్యే అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న ఏ శాఖలు కూడా సరిగా పనిచేయడం లేదన్నారు.
అధికార పార్టీకి పోలీసులు మడుగులొత్తడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయని తెలి పారు. మహిళా మంత్రులకు మహిళలపై జ రుగుతున్న నేరాలు పట్టవా అని ప్రశ్నించారు. వారికి తమ సంపాదనపై శ్రద్ధ పెరి గిందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్‌ఎస్ కార్యకర్తలను బెదిరించడం ఆపాలని, తన నియోజ కవర్గంలో అత్యాచారానికి గురైన మహిళను ఓదార్చాలని హితవు పలికారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు.