2 June, 2026 | 1:00 AM

సిద్ధాపూర్ డంపింగ్‌యార్డ్ ప్రతిపాదనపై బీఆర్‌ఎస్ చలో కలెక్టరేట్

02-06-2026 12:25 AM

పాదయాత్రను ప్రారంభించిన సబితా

షాద్నగర్, జూన్ 1(విజయక్రాంతి): కొత్తూరు మండలం సిద్ధపూర్ గ్రామంలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన భూముల్లో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘చలో కలెక్టరేట్’ పాదయాత్ర సోమవారం ప్రారంభమైంది. మాజీ ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో చేపట్టి న ఈ పాదయాత్రను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సబ్జా ఇంద్రారెడ్డి మాట్లాడు తూ ఏ భూముల్లో ఏ పరిశ్రమలు పెట్టాలో, ఎక్కడ డంప్ యార్డులు నిర్మించాలో సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్ధపూర్ ప్రాంతంలో ఐటీ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 350 ఎకరాల భూమిని సేకరిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని చూడటం దారుణమని నేతలు మండిప డ్డారు.

ఈ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మహేశ్వరం అభివృద్ధిపై రేవంత్ సర్కార్ వివక్ష

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

రంగారెడ్డి, జూన్ 1(విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరైన ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ వివక్ష చూపిస్తోందని ఆమె మండిపడ్డారు.సోమవారం తన నివాసం లో మీడియా సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఫార్మాసిటీ కోసం మహేశ్వరం పరిధిలో వేల ఎకరాల భూమిని సేకరించారని గుర్తు చేశారు.