2 June, 2026 | 1:00 AM

ప్రజానాయకుడు ఈటల రాజేందర్

02-06-2026 12:27 AM

మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి

ఘట్ కేసర్, జూన్ 1 (విజయక్రాంతి) : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన ఘట్కేసర్ పట్టణంలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తె లంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ప్రజానాయకుడని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను, ప్రజల కోసం సాగించిన పోరాటా ల ను ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచే నాయకుడిగా, అర్ధరాత్రి అయినా ప్రజల సమస్యలకు స్పందించే వ్యక్తిగా ఈటెల రాజేందర్ ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. హుజూరాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు ప్రజలు ఆయనకు అందించిన అపారమైన ఆదరణ, విశ్వాసమే ఆయన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

కొంతమంది రాజకీయ అసూయతో, వ్యక్తిగత ద్వేషంతో, పార్టీని బలహీనపరిచే ఉద్దేశంతో ఈటెల రాజేందర్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే అసత్య ఆరోపణలు, దుష్ప్ర చారాలతో ప్రజల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించలేరని స్పష్టం చేశారు.

ఈదుష్ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈటెలకు కార్యకర్తలు మద్దతుగా నిలవాలని, పార్టీ బలపడితే తెలంగాణలో కమలం వికసిస్తుందని సుదర్శన్ రెడ్డి అన్నారు.