ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ కో-ఆప్షన్ సభ్యుల నామినేషన్ దాఖలు
ఆమనగల్లు, ఏప్రిల్ 13(విజయక్రాంతి )మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ తరపున కో-ఆప్షన్ సభ్యుల నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కౌన్సిలర్ పాపిశెట్టి రాము ముఖ్య అతిథిగా హాజరై, మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్కు బీ ఆర్ ఎస్ అభ్యర్థులు సయ్యద్ ఖలీల్, జంతుక అల్లాజీ,కమటం రాధమ్మ,అస్మత్ బేగంలు నామినేషన్లు దాఖలు చేశారు.ఈ సందర్భంగా పాపిశెట్టి రాము మాట్లాడుతూ,
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ, కొన్ని నాటకీయ పరిణామాల వల్ల చైర్మన్ పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, కౌన్సిల్లో తమకు స్పష్టమైన మెజార్టీ ఉన్నందున మెజార్టీ కో-ఆప్షన్ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎనుమల్ల రమేష్, దుడ్డు ఆంజనేయులు యాదవ్, నాగిళ్ళ జగన్, ఎంగళి భాగ్యమ్మ, కాలె యశోదమ్మ, పుల్లారెడ్డి అనూషతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్ గౌడ్, నాయకులు ఎంగళి రఘు, వెంకటయ్య, సైదులు గౌడ్ పాల్గొన్నారు.






