15 April, 2026 | 4:40 PM

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి..

14-04-2026 01:06 AM

మేడిపల్లి ఏప్రిల్ 13 (విజయక్రాంతి): తన సొంత బావమరిది, అతని భార్య, అత్త వల్ల తనకి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్లకు చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, కూతురు చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిలు గత జనవరి 30 అర్ధరాత్రి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

తన భార్య విజయశాంతి రెడ్డి, కూతురు, కుమారుడు, మరణానికి ఆమె సోదరుడు అయినా తన బావమరిది వడకల్లా చిరంజీవి, అతని భార్య, లక్ష్మి అత్త పుష్పవతి, లే కారణమని సురేందర్ రెడ్డి ఆరోపించారు. తాను దుబాయిలో  జాబ్ చేస్తూ అక్కడే ఉండి ఆరు నెలలకు ఒకసారి వచ్చి పోతూ ఉంటానని, తన భార్య సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఆమె తమ పిల్లలను చదివించుకుంటూ ఇక్కడే ఉండేదని అన్నారు.

తమ వద్ద ఉన్న డబ్బుతో తన భార్యతో కలిసి చిరంజీవి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే వారిని, అతనితో ఆర్థిక లావాదేవీల విషయంలో, తన భార్య తరపు కుటుంబ సభ్యుల వేధింపులతో మానసిక వేదనతో తన భార్య పిల్లలతో సామూహికంగా ఆత్మహత్య చేసుకుందని భర్త సురేందర్ రెడ్డి ఆరోపించారు. ముగ్గురు చావులకు కారణమే కాకుండా తన ఆస్తిని కాజేయాలని చిరంజీవి అతని కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు. విజయ రెడ్డి చనిపోయినప్పుడు ఇంట్లో ఉన్న 1కోటి 40 లక్షల రూపాయలు, కేజీన్నర బంగారం, విలువైన ఆస్తి పత్రాలు, తీసుకొని వెళ్ళిపోయారని, పోలీసుల తనకు న్యాయం చేయాలని భర్త సురేందర్ రెడ్డి కోరారు.