09-07-2025 11:27:04 AM
హైదరాబాద్: కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనలో ఒకరు మృతి చెందారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మంగళవారం కూకట్ పల్లి హైదర్ నగర్(Hyder Nagar) లోని వివిధ కౌంపౌండ్లలో కల్లు తాగిన వారితో కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. "కూకట్‌పల్లిలోని దుకాణంలో కల్లు తాగి మొత్తం 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిని చికిత్స కోసం రామ్‌దేవ్ ఆసుపత్రికి(Ramdev Hospital) తరలించారు. అక్కడ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు" అని ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.