09-07-2025 12:16:45 PM
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (Special Intelligence Bureau) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఆయన ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనధికార నిఘా కార్యకలాపాలపై సిట్(Special Investigation Team) దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 14న విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు(Prabhakar Rao) సిట్ ఆదేశించింది. గతంలో సిట్ అధికారులు ప్రభాకర్ రావు ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ సీజ్ చేశారు. ప్రభాకర్ రావు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ను సిట్ ఎఫ్ఎస్ఎల్ కు పంపింది. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి ప్రశ్నించనుంది.