09-07-2025 12:51:45 PM
హైదరాబాద్: కూకట్‌పల్లి కల్తీ కల్లు(Kukatpally Adulterated Toddy Incident) ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీఆసుపత్రిలో(Gandhi Hospital) చికిత్స పొందుతూ సీతారాం(47) అనే వ్యక్తి మరణించాడు. హైదర్ నగర్(Hyder Nagar)లో ఉంటున్న వనపర్తి జిల్లాకు చెందిన సీతారం మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. నిన్నకూకట్ పల్లి హైదర్ నగర్ లో కత్తీ కలులు తాగి 19 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన 19 మందిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోగా, 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్ పోలీసులు(Excise Police) ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కత్తీ కల్లు ఘటనలో ఎక్సైజ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. పలు కల్లు దుకాణాలు నుంచి నమూనాలు సేకరించారు.
ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Telangana Excise Minister Jupally Krishna Rao) బుధవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి కల్తీ కల్లు తాగిన బాధితులను పరామర్శించారు. మంత్రితో పాటు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ కూడా ఉన్నారు. కల్తీ కల్లు ఘటనలో మొత్తం 19 మంది అస్వస్థతకు గురయ్యారని మంత్రి జూపల్లి తెలిపారు. ఆస్వస్థతకు గురైన బాధితుల్లో 15 మంది నిమ్స్ లో, ఇద్దరికి గాంధీలో మరో ఇద్దరికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని జూపల్లి చెప్పారు. కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్ లను సీజ్ చేసి, కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అరెస్ట్ చేశామని సూచించారు. కల్లు శాంపిళ్లను కెమికల్ టెస్ట్ ల్యాబ్ కు పంపించామన్నారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "బాధితులందరూ నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా లేదు. వారిని త్వరలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తారు. ఈ సంఘటనకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మద్యం నమూనాను పరీక్ష కోసం పంపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము" అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.