calender_icon.png 9 July, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మెలో సింగరేణి కార్మికులు

09-07-2025 08:26:54 AM

కుమ్రంభీంఅసిఫాబాద్(విజయక్రాంతి): కేంద్రప్రభుత్వం(Central Government) కార్మిక రంగంపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కార్మిక సంఘాల(Labor unions) పిలుపుమేరకు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు(Singareni workers) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన  నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్ లను సింగరేణి కేటాయించాలని, కోల్ ఇండియా లో విదేశీ పెట్టుబడును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.సింగరేణి సంస్థ వెంటనే లాభాల వాటను ప్రకటించి కార్మికులకు 40 శాతం ఇవ్వాలని సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని అన్నారు..