02-02-2026 12:28:31 AM
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు
కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సి ట్ నోటీసులు పంపిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి క రీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ నగరశాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
కెసిఆర్ కు నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖం డించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్లని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని, ఈ క్రమం లోనే ఈ చర్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదా సు లక్ష్మణ్ రావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తోపాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హు జూరాబాద్ లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నోటీసులు పంపడంపై రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగం యూనివర్సిటీ ఇంచార్జి చుక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ వద్ద వి ద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సి ట్ విచారణ పేరిట ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటూ యూనివర్సిటీ బీఆర్ ఎస్ అధ్యక్షుడు తిప్పనపల్లి ప్రకాశ్, నాయకు లు శ్రీకాంత్, అలవోని శ్రావణ్, శివరాం, శశాంక్, సాయికృష్ణ, ధ్వజమెత్తారు.
- పెద్దపల్లి జిల్లాలో...
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు. కేసీ ఆర్ పై కక్ష పూరితంగా రాజకీయ కుట్రలో భాగంగా సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేశారని మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుల్తానాబాద్ లో బీఆర్‌ఎస్ నా యకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
మున్సి పల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్ సర్కార్ ఈ చర్యకు పాల్పడిందని సుల్తానాబాద్ పార్టీ నగర అధ్యక్షులు పారుపెల్లి గణపతి, మాజీ ప్రజా ప్రతినిధులు సందీప్ రావు, సూర శ్యాం, వాల రామారావు, అనుమల్ల బాపురావు, అంజిబాబు, నారాయణ, రాజమల్లయ్య, ఎం డి సర్వర్, నరేందర్, బండి సంపత్ లు ధ్వజమెత్తారు.
- సిరిసిల్ల జిల్లాలో...
కేటీఆర్ స్వంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొ డతామని ఈ సందర్భంగా ఆగయ్య హెచ్చరించారు. వేములవాడలో నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టా రు. తెలంగాణ చౌక్ వరకు వందలాది మం ది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తప్పుడు కేసులతో విచారణల పేరుతో కెసిఆర్ ను ఇబ్బంది పెట్టడం తెలంగాణ ప్రజ లను అవమానపర్చడమేనని లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- జగిత్యాల జిల్లాలో...
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజ య్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రె స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మున్సిపల్ ఎ న్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీని దొంగచాటున దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ధ్వ జమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మా ర్కెట్ కమిటీ చైర్మన్ గుడ్ల మనోహర్, నాయకులు దారిశెట్టి రాజేశ్, చీటి వెంకట్రావు, తది తరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంతోపాటు మెట్పల్లి, ధర్మపురిలో నిరసన కార్యక్ర మాలు కొనసాగాయి.