02-02-2026 12:27:21 AM
నీకు ఫోన్ వచ్చిందా? నాకు రాలేదు? అధికార పార్టీ నేతలు
రెబల్స్ బుజ్జగింపులు ఫలిస్తాయా?
టికెట్ రానివారు స్వచ్ఛందంగా విత్ డ్రా చేసుకోవాలంటున్న అధికార పార్టీ
తన కుమారుడికి లైన్ క్లియర్ చేసుకున్న మైనార్టీ నేత!
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి మరింత ఊబందుకుంది. ఉమ్మడి జిల్లాలోని తల మానికంగా ఉన్న మహబూ బ్ నగర్ కార్పొరేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం విధితమే. ఈ తరుణంలో మ హబూబ్ నగర్ కార్పొరేషన్ తొలి మేయర్ ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారినప్పటికీ డివిజన్ల కు సంబంధించి ఆయా పార్టీలలో సీట్ల కేటాయింపు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ సైతం తర్జనభజన పడుతున్నాయంటే డివిజన్ లలో అభ్యర్థులు సీట్లు ఆశి స్తున్న వారి సంఖ్య ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు సంబంధించి బిజెపి నుంచి 78 మంది, ఎంఐఎం 23, కాం గ్రెస్ నుంచి 216, బీఆర్‌ఎస్ 99,అప్ 2, బీఎ స్పి 7, ఇతర గుర్తింపు పొందిన పార్టీలకు సం బంధించి 25, స్వతంత్ర అభ్యర్థులు 64 మం ది అభ్యర్థులు మొత్తం 516 మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ నెల 3వ తేదీ విత్ డ్రా కు అవకాశం ఉండడంతో అప్పటివరకు బరిలో ఉండే వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. 60 కార్పొరేటర్ లు అయ్యేం దుకు ఆసక్తి కనబరుచుతున్నారు.
ఆ రెండు పార్టీలు సీట్ల కేటాయింపులో ముందంజ...
గెలుపు ఓటములు అటు ఉంచితే బిజెపి ఎంఐఎం పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు ముందుగానే పరిష్కార రూపం దా ల్చాయి. బిజెపి ఇప్పటికే 47 మంది కార్పొరేటర్ అభ్యర్థులను ఖరారు చేయగా ఎంఐ ఎం 17 స్థానాలలో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్‌ఎస్ పార్టీలు కొన్ని డివిజన్లో ఖరారు అనుకున్నప్పటికీ అత్యధిక డివిజన్లో సీటు ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
దీంతో కొంతమంది నాయకులు మాకు ఫోన్ వచ్చింది.. సీటు ఖాయం అం టుండ్రు మీకు ఫోన్ వచ్చిందా అంటూ ఫో న్లలో సంప్రదింపులు జరుపుతున్నట్లు కొంతమంది అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తుండ్రు. కాగా అసలు విషయానికి వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా పేర్లను బహిర్గతం చేయకుండా పార్టీ ఎవరికి పేరు చెబితే వారి గెలుపు కోసం కార్యకర్తలు అందరూ పాటుపడాలని సర్వేలు అవే చెబుతున్నాయని ఇప్పటికే ప్రకటించింది.
గత పది ఏళ్ల క్రితం టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ జెండాను పట్టుకొని ఉన్న నేతలకు కార్పొరేటర్ సీటు ఆశించిన వారికి ఆ సీటు దక్కుతుందా ఆ సీట్లపై ఆ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పలువురు అభ్యర్థులకు సైతం ఆయా ప్రాంతాలలో సీట్లు కేటాయింపు జరుగుతుందని ఆరోపణలు కూడా బలం చేకూరుతుంది. దీంతో సీటు ఎవరికి వస్తుంది ఎవరు ఎవరిని కలుపుకొని పోవాలి అనే సందేహంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్న మాట.
- కాంగ్రెస్ నేత కుమారుడికి లైన్ క్లియర్ అంట?
అధికార కాంగ్రెస్ పార్టీలో ఓ మైనార్టీ నాయకుడి కుమారుడికి ఇతర పార్టీల నుంచి ఎవరు వేయకుండా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో నుం చి కూడా ఆ డివిజన్ నుంచి ఆ నేత కుమారుడికి సీటు ఖాయమంటూ అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు సై తం చెబుతున్నారంటే ఆ నేత పలుకుబడి ఎంత ఉందో తెలుస్తుంది. ఇన్నాళ్లు ఆ నేతను నమ్ముకుని ఉన్న నాయకులు ఇప్పుడు తన కుమారుడికి సీటు అంటూ చక్రం తిప్పడం తో మైనార్టీ నాయకులు సైతం కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు.
- ప్రచారానికి సమయం తక్కువే...
ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి తక్కువ సమయం ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీంతో ఈ నెల మూడో తేదీ వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండడంతో పాటు ఖ రారు చేసే విషయం కూడా ఈ తేదీతోనే ముగింపు పలకనుంది. దీంతో ఈనెల 11 తే దీన ఎన్నికలు ఉండడంతో 9వ తేదీ వరకు మాత్రమే ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా ఇప్పటివరకు ప్రధాన పార్టీలలో అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో మాకు మద్దతు తెలపండి... అమ్మా గెలుపుకు సహకరించండి అంటూ ప్రచారం చేసుకున్నప్ప టి కీ కొన్ని డివిజన్లో అసలు సీటు ఎవరికి వ స్తుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో తీ వ్ర ఆందోళనల మధ్యనే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల సీట్ల ఖరారు ఎవరికి వరిస్తాయో? గెలుపు ఎవర నిఆహ్వానిస్తుందోతెలియనిపరిస్థితినెలకొంది.