5 September, 2026 | 11:36 AM

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

29-08-2026 | 08:05pm

వారం రోజుల నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ

మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం

చొప్పదండి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించిన వారం రోజుల నిరసన కార్యక్రమాలకు సంబంధించి చొప్పదండి నియోజకవర్గంలో కార్యాచరణ ఖరారైంది. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న మల్యాల మండలంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు తీరుపై బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడనున్నారు.

అలాగే వారం రోజుల పాటు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల కార్యాచరణను వెల్లడించనున్నారు. సెప్టెంబర్ 2న గంగాధరలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ క్యాలెండర్‌ తదితర అంశాలపై నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. సెప్టెంబర్ 3న కోడిమ్యాలలో రైతులు, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్‌, భూసమస్యలపై నిరసన నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న బోయినపల్లిలో మహిళలు, వృద్ధులు, వికలాంగుల సమస్యలతో పాటు మహిళలకు ఇచ్చిన హామీలు, గ్యాస్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ తదితర అంశాలపై నిరసన చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 5న గంగాధరలో విద్యార్థులు, యువత సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జాబ్‌ క్యాలెండర్‌ తదితర అంశాలపై కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6న రామడుగులో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై నిరసన చేపట్టనున్నారు. సెప్టెంబర్ 7న చొప్పదండి, మల్యాలలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను గుర్తించి నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు