29 August, 2026 | 8:40 PM

Breaking News

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •  

ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

29-08-2026 07:36 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగుభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శివకృష్ణ, పిడి శ్రీనివాస్, కళాశాల అధ్యాపక బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అదేవిధంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు విశేష సేవలు అందించిన గిడుగు వెంకట రామమూర్తి పంతులను స్మరించుకున్నారు. సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే వ్యవహారిక తెలుగు భాష అభివృద్ధికి గిడుగు చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. క్రీడలు ఆరోగ్యకరమైన శరీరంతో పాటు క్రమశిక్షణతో కూడిన మనసును అందిస్తే, భాష సాహిత్యం జ్ఞానం సంస్కృతి,విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.