29 August, 2026 | 8:40 PM

Breaking News

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •  

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...

29-08-2026 07:38 PM

- ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం 

- మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకులు జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం మండల, పట్టణ స్థాయి నాయకులతో జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు చేపట్టనున్న వరుస నిరసన కార్యక్రమాల వివరాలను నాయకులకు వివరించారు. పట్టణంతో పాటు అన్ని మండలాల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని జోగు రామన్న పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసినా ఎక్కడా వెనకడుగు వేసేది లేదన్నారు.

ప్రజలుఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.రైతుబంధు, రైతుబీమా, ఎరువుల ధరలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్, యూత్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, మురికివాడల సమస్యలు, గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, బస్తీ దవాఖానాల పరిస్థితి తదితర అంశాలపై ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.