calender_icon.png 2 November, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ ఇంచార్జ్

01-11-2025 04:59:36 PM

గద్వాల: గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ ప్రభుత్వ బాలురు హాస్టల్‌లో కలుషిత ఆహారం తీసుకొని విద్యార్థులు అస్వస్థతకు గురై  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హన్మంత్ నాయుడు శనివారం విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.