01-11-2025 04:59:36 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మాత్యులు నలమాధ ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో పెదవీడు గ్రామానికి 50 లక్షల రూపాయల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలోని దళితవాడలలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ కరీం మాట్లాడుతూ మంత్రి సహకారంతో భవిష్యత్తులో మరెన్నో నిధులను గ్రామానికి తీసుకువచ్చి గ్రామంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పెదవీడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు దళిత నాయకుల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చిలక సీతమ్మ గురవయ్య,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బూర సోములు గౌడ్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ గాయం ఆదిరెడ్డి,హుజూర్నగర్ నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెల్లబాటి శ్రీనివాస్, మండల నాయకులు మాళోతు బీముడ,మండల ఎన్ ఎస్ యుఐ అధ్యక్షుడు చిలక లోకేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ రహీం,మల్ రెడ్డి ఆదినారాయణరెడ్డి,సయ్యద్ రహీం,అమరవరపు వెంకటేశ్వర్లు, యువనాయకులు చిలక రాంబాబు తదితరులు పాల్గొన్నారు.