01-11-2025 05:01:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): లక్ష్మణచాంద మండలం పీచర గ్రామ మాజీ ఎంపీటీసీ బుర్రి భూమన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శనివారం నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను వచ్చి పార్టీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్నాల రాజేశ్వర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండ్రు నరేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి, మాజీ డైరెక్టర్ గుర్రాల లింగారెడ్డి, ఆత్మ డైరెక్టర్ కిరణ్ ఠాగూర్, తదితరులు పాల్గొన్నారు.