17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేత చల్మెడ

09-06-2025 12:43 AM

కోడెల పై రాజకీయం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిరు. 

సిరిసిల్ల జూన్, 8 (విజయక్రాంతి): వేములవాడ నియోజక వర్గం టిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మడ లక్ష్మీనరసింహారావు స్పందించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు గోశాలను ఎన్నడూ రాజకీయం చేయలేదు.కలెక్టర్ కన్వీనర్ గా ఉండి ఒ క్కో రైతుకు రెండు కోడెలు ఇవ్వాల్సిన నిబంధనలను తుంగ లో తొక్కింది మంత్రి సురేఖ తన సిఫారసు లెటర్ మీద గీసు కొండ రాంబాబుకు 60 కోడెలను ఇచ్చింది నిజం కాదా.

60 కోడెల్లోని 49 కోడెలు మాయమైంది నిజం కాదా, అన్ని పత్రిక ల్లో, చానెళ్లలో వచ్చింది నిజం కాదా.దీనికంతటికి కారణం, అసలైన ముద్దాయి మంత్రి సురేఖనే.మంత్రి చేసిన నిర్వాకం వల్ల డిసెంబర్ 1నుండి కోడెల పంపిణీ ఆపితే 500 ఉండా ల్సిన స్థానంలో 1300కు చేరిన మాట వాస్తవం కదా.ఇక్కడ అసలైన రాజకీయం ఎవరు చేస్తున్నారో ఆలోచన చేయలే.

స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడల న్నీ  స్కిన్ వచ్చి చనిపోతున్నాయని అంటున్నారు. కానీ వెటర్న రీ డాక్టర్లు మాత్రం సరైన పోషక ఆహారం అందక చనిపో తున్నాయని అన్నారు.ఇలా సరైన పోషణ లేక కోడెలు చనిపోవడం చాలా బాధాకరం.రోజుకు పది టన్నుల పశు గ్రాసం వస్తుందని అంటున్నారు కానీ రెండు టన్నులు కూడా గోశాలకు రావడం లేదన్నారు.మరి మిగిలిన గడ్డి ఎవరు మేస్తున్నారు, నెలకు ఐదు లక్షల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అంటూ ప్రశ్నించారు. 

కోడె మొక్కులతో ఏటా 22కోట్లు వస్తున్న అందులో కేవ లం 18లక్షలు ఖర్చు పెడితే కోడెలు బాగుంటాయి అన్నారు. జూన్15 నుండి ఆలయాన్ని మూసి వేస్తామని ప్రకటించి భ క్తులను ఆగం చేశారనీ రాజన్న సన్నిధికి నిత్యం 20 వేలకు పైగా భక్తులు వస్తుండగా కనీసం వారికి కూడా సరియైన వస తి సౌకర్యాలు కల్పించడం లేదు అన్నారు. గంటల తరబడి నిరీక్షించి క్యూ లైన్ లోనే భక్తులు పడిపోతున్న పట్టించుకోవ డం లేదనీ మండిపడ్డారు.

గత ప్రభుత్వం తయారుచేసిన న మూనా చిత్రాలు, ప్లాన్  ఇంకా నడుస్తుంది. పత్రికలలో ఇవే ప్రచురితమవుతున్నాయి. గత ప్రభుత్వం రూపొందించిన ఛా యాచిత్రాలు అభివృద్ధి పేరుతో పత్రికల్లో వస్తున్న కథనాలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. ఇవే ఉంటాయా మరి మారుతాయా. కనీస మీ డిపిఆర్ అయినా ఎవరికైనా వివరించారా అని ప్రశ్నించారు.

కోడెల మృతికి కారణం అధికారుల, ఈ.ఓ నా మరి ఇంకెవరు.. దుర దృష్టం ఏమిటంటే కోడెల మృతి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రావద్దు  చేతగాని తనం, అసమర్థ పాలన వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికైన రాజన్న కోడెల సంరక్షణ సరిగా చేపట్టాలి. రద్దీకి తగినట్లు సౌకర్యాలు కల్పించాలి.

తక్షణమే సంబంధిత వారిపై చర్యలు తీసుకొని గడ్డి స్కామ్ లో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, రాఘవరెడ్డి, పొలస నరేందర్ మాజీ కౌన్సిలర్లు నిమ్మిశెట్టి విజయ్,నరాల శేఖర్, జోగిని శంకర్ ముద్రకోలు వెంకటేశం, నాయకులునరాలదేవేందర్.