బీఆర్‌ఎస్ నాయకులు గైని శ్రీనివాస్ గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరిక
పార్టీ కండువా కప్పిన కవిత
కామారెడ్డి, జూన్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కామారెడ్డి, పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ, మాజీ చైర్మన్ గైని శ్రీనివాస్ గౌడ్ బి ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కామారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవిత, కవిత మాట్లాడుతు.. టిఆర్‌ఎస్ పార్టీ జెండా పండుగను ప్రతి గ్రామాన, మండలాల, జిల్లాలో జెండా గద్దెలు నిర్మించి జెండావిష్కరణ చేయాలని. కవిత గైని శ్రీనివాస్ గౌడ్ కు ఆదేశించారు. టిఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కామారెడ్డి నియోజకవర్గంలో కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు రంగు నవీన చారి, సదాశివనగర్ మండల టిఆర్‌ఎస్ నాయకులు సాయ గౌడ్, సతీష్, సాయి కుమార్ టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.






