దేశాన్ని నడిపించడం అంటే బృహత్కార్యం: పవన్
కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగలడం సహజం
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం.. భోగాపురం ఎయిర్ పోర్టు
విజయనగరం: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం(Alluri Sitarama Raju International Airport) ప్రారంభోత్సవం(భోగాపురం)లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) తెలిపారు. దేశాన్ని ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తున్న నేత.. మోదీ అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోదీ సాకారం చేస్తున్నారని వెల్లడించారు.
తెలుగు జాతి ఎవరికీ తలవంచదని అల్లూరి గర్జించారని చెప్పారు. అల్లూరి ఆశయాలను, స్ఫూర్తిని భావితరాలకు అందిస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో(North Andhra Development) సరికొత్త అధ్యాయం.. భోగాపురం ఎయిర్ పోర్ట్(Bhogapuram Airport) అని పవన్ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పనే కీలకమని ప్రధానికి తెలుసన్నారు. రైల్వే జోన్ ఇచ్చి ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని తెలిపారు. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగలడం సహజం అన్నారు. దేశాన్ని నడిపించే నేతపై కొందరు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆగ్రహించారు.
జంతర్ మంతర్(Jantar Mantar)లో మోదీని అనేకమంది దూషిస్తే బాధ కలిగిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎంతమంది విమర్శిస్తున్నా పట్టించుకోకుండా మోదీ పనిచేస్తున్నారని కొనియాడారు. ఇంత కష్టపడే మోదీకి దేశ ప్రజలంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. తిట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించిన వ్యక్తి.. మోదీ అన్నారు. నాయకుడి కష్టాన్ని గుర్తించాలి.. అర్థం చేసుకోవాలన్నారు. దేశాన్ని నడిపించడం అంటే బృహత్కార్యం అన్నారు. సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధానికి మనం ఏం ఇవ్వగలమని పవన్ తెలిపారు. దేశ పరిపాలన పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలని కోరుకుంటున్నామని పవన్ వెల్లడించారు.






