12 June, 2026 | 1:41 AM

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

12-06-2026 12:39 AM

మహబూబాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ గురువారం క్యాం పు కార్యాలయంలో మహబూబాబాద్ పట్ట ణ అభివృద్ధి, నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై సమీ క్ష నిర్వహించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల నిలువల అందుబాటు, ఇతర అంశాలపై చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు.

అలాగే మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న అ భివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో మొదటి విడత మంజూరైన ఇండ్లను పూర్తిస్థాయిలో నిర్మించే విధంగా కృషి చేయాలని, రెండో విడత నిర్మాణ పనులకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఎక్కడ కూడా అధికారులు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వ హించకూడదని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు పాల్గొన్నారు.