calender_icon.png 8 February, 2026 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటిన బీఆర్ఎస్ నేత

08-02-2026 05:48:49 PM

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాజుల సుమన్ మరోసారి మానవత్వం చాటారు. మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన రేగుంట రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా గాజుల సుమన్ 50 కిలోల బియ్యంను మృతురాలి కుటుంబానికి అందించారు. నిత్యం ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే గాజుల సుమన్ మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ అభ్యర్థిగా స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో గ్రామస్తుల మనసులో గాజుల సుమన్ చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆయన వెంట గాజుల నరేష్, ఎనగందుల తిరుపతి లు ఉన్నారు.