08-02-2026 05:46:00 PM
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ,(విజయక్రాంతి): ఈ నెల 11న జరిగే రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నేడు దేవరకొండ పట్టణంలోని 10 వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపును ఆకాంక్షిస్తూ, ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించి, మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పట్టణ ముఖ్య నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.