calender_icon.png 21 October, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిజిఆర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు

21-10-2025 08:02:16 PM

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండి శ్రీకాంత్ గౌడ్, దీపావళి పర్వదినం సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా గంధం చెక్కతో ప్రత్యేకంగా తయారు చేసిన గోవర్ధన్ రెడ్డి ఫోటోను బహూకరించి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రజల సేవలో, అభివృద్ధి కార్యక్రమాల్లో బిఆర్ఎస్ నాయకులు ఇలాగే ముందుండాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్,మంద రమేష్,బ్రహ్మేందర్ గౌడ్,అంజి రెడ్డి,ఏర్పుల లింగం,నీలం మోహన్, సత్యనారాయణగౌడ్, ఈద్గానిమల్లేష్, యాదయ్య,యాదగిరి, మల్లేష్,దుబ్బాక మహేష్, శ్రీనివాస్ యాదవ్,మహేష్ యాదవ్, వెంకట్ రెడ్డి, భాస్కర్, పోచయ్య, వెంకటేష్, ప్రసాద్, సురేష్,నాని,మేదరి విట్ఠల్,డప్పు రాజు,సిజిఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.