21-10-2025 08:06:39 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని చిట్యాల గ్రామ నివాసీ బోచ్చు బక్కయ్య తన కూతుర్లను చిట్యాల ప్రధాన రహదారిపై కన్నాయిగూడెం వైపు తీసుకుని వస్తుండగా మల్కపల్లి చెరువు మూలమీద కారు అతివేగంగా ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రనవాహనంపై వస్తున్న బొచ్చు సింధుజ(17) అనే యువతి అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ఇద్దరికి స్వల్పగాయాలు అయినాయి. మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితి పరిశీలించి కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేష్ తెలిపారు.