21-10-2025 07:54:55 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): దీపావళి పండుగ, కార్తీక మాసం సందర్భంగా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి సోమేశ్వరాలయం విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతుంది. ప్రతి సంవత్సరం సోమేశ్వరాలయంలో గ్రామస్తులు దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. దీపాలంకరణతో పాటు విద్యుత్ వెలుగులతో ఈ శివాలయం తన ప్రత్యేకతను చాటుకుంటుంది. గ్రామ ప్రారంభంలో గల ఆంజనేయుని విగ్రహం వద్ద గ్రామస్తులు చేసిన దీపాలంకరణ ఆధ్యాత్మిక శోభను చాటుతుంది.