30 March, 2026 | 1:34 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

కాంగ్రెస్‌లో చేరికల జోరు

03-05-2024 02:04 AM

హస్తం గూటికి చేరిన కూసుమంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీ

జిల్లాల్లో పెద్ద ఎత్తున చేరికలు

మంథని/చొప్పదండి/కూసుమంచి, మే2 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లోకి వలసల జోరు పెరిగింది. అనేక మంది బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరారు. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ సమక్షంలో పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఖమ్మం జిల్లా కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మ సహా అనేక మంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు.  చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో గంగాధర మండలం ర్యాలపల్లి ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో చాకుంట మాజీ సర్పంచ్ పెద్ది శంకర్ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు.