మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
- రంగారెడ్డిలో డ్రగ్స్ పట్టివేత..
- గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్
- రైల్వే సూపరింటెండెంట్ అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ మాదకద్రవ్యాల రాకెట్ బట్టబయలైంది. నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 33 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మోకిలా నుంచి కొల్లూరుకు డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ పెడ్లర్ రైల్వే శాఖలో సూపరిండెంట్ గా పనిచేస్తున్నాడు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. రైల్వే ఉద్యోగి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఒక ప్రముఖ సాంకేతిక సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మరో వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




