కుల మతాలకు అతీతంగా బీజేపీకి మద్దతు
03-05-2024 02:03 AM
పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కుల, మత, ప్రాంతీయ, వర్గ భేదాలకు అతీతంగా ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు పార్క్‌ల్లో వాకర్స్‌ను కలిశారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో గెలిచి శేరిలింగంపల్లి ప్రాంతంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు చేయడం లేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రచారంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




