13 July, 2026 | 9:57 PM

Breaking News

కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •  

పోలీస్ స్టేషన్ ముందు భీష్మించుకు కూర్చున్న మాజీ మంత్రులు

04-11-2024 01:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీ సర్పంచుల అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోలన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందిన సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అయితే వారిని పోలీసులు  అరెస్టులు చేసిన విషయం తేలిసిందే.

అరెస్టు చేసిన మాజీ సర్పంచులకు మద్దుతుగా హరీశ్ రావు సోమవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేసేదాకా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళేది లేదని హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. దీంతో వారికి పోలీసులు ఎంత నచ్చజెప్పిన వినకపోవడంతో పోలీసులు  మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, డా.సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.