కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి..
*ఉట్నూర్ లో రాస్తారోకో చేసిన బీఆర్ఎస్ నాయకులు..
ఉట్నూర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కల్యాణ లక్ష్మి.. షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఉట్నూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పంద్రా జై వంతరావు ఆరోపించారు. పార్టీ పిలుపుమేరకు ఉట్నూర్ లోని ఐపీ చివరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విప్లవమైందని అన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను యధావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా అనంతరం డిప్యూటీ తహసిల్దార్ అమృతలాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






