29-07-2024 11:31:59 AM
మా ప్రభుత్వంలో విద్యుత్ వినియోగం పెరిగింది
హైదరాబాద్: అవసరమైతే 10 రోజులు అదనంగా శాసనసభ నడుపుదామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి. సభలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకోలేదని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం ఇచ్చే రూ. 30 వేల కోట్లను కూడా వదులుకున్నామని ఆయన సూచించారు. విద్యుత్ మీటర్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించారని ఆరోపించారు.
మోడీ, కేసీఆర్ ఉదయ్ స్కీమ్ గురించే మాట్లాడుకున్నారని స్పష్టం చేశారు. 2014 ముందు రైతులకు కరెంట్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరిగిందన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ లైన్ల కింద ఇల్ల నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందన్నారు. 2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 1,196 కిలో వాట్లు, 2024లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 2,349 కిలో వాట్లు అని లెక్క చెప్పారు. తమ ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందని జగదీష్‌రెడ్డి తెలిపారు.