పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
నర్సాపూర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని ఆయన విగ్రహానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన తెలంగాణ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం, ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికిస్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






