calender_icon.png 14 November, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కేసీఆర్ ఒప్పుకోలె..

29-07-2024 02:48:12 AM

మోటర్లకు మీటర్ల విషయంలో సభను 

తప్పుదారి పట్టించేందుకు రేవంత్‌రెడ్డి ఎత్తులు

మీటర్ల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? 

సీఎంకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ 

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు 2017లో మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పకొన్నారని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం చదివిన పేపర్ పూర్తిగా అబద్ధమని, ఉదయ్ పథకానికి చెందినదని తెలిపారు. ఆదివారం తెలం గాణ భవన్‌లో మాజీమంత్రి మహమూద్ అలీ, బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, వాసుదేవరెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం మా మెడపైన కత్తిపెట్టి రైతుల మోటర్లకు మీటర్లు పెట్టమన్నా తమ నాయకుడు ఒప్పుకోలేదని.. అలాంటి వారిపై నిందలు వేయడాన్ని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అంటే అబద్ధానికి పర్యాయ పదంగా  మారిందని, మోసాలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, అదే పద్ధతిలో పాలన కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మీటర్లకు తాము ఒప్పకోలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మాఫీయాను నడుపుతున్నారని, తన మీడియాలో బీఆర్‌ఎస్ పార్టీపై అబద్ధపు రాతలు రాయిస్తున్నా రని చెప్పారు.

త్వరలోనే విద్యు త్తు వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడా నికి కుట్రలు చేస్తున్నారని, విద్యుత్తు సంస్థలను ప్రైవేటు శక్తులను అప్పగించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా రైతుల దగ్గర స్మార్ట్ మీటర్లు ఉన్నాయో చెప్పాలని, చీప్ ట్రిక్కులు ప్లే చేస్తున్నారని రేవంత్ తీరుపై మండిపడ్డారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు నిధులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఉదయ్ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా కేంద్రం రూల్ తెచ్చిందని స్పష్టంచేశారు. దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉన్నదని దుయ్యబట్టారు.

అసెంబ్లీలో మందబలంతో ఏమైనా మార్చగలడేమా కానీ ప్రజల నుంచి తప్పించుకోలేడని రేవంత్‌ను ఉద్దేశించి అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎవరు దాచిపెట్టలేరని.. అసెంబ్లీలో తప్పించుకున్నావ్, బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఉదయ్ స్కీంలో 27 రాష్ట్రాలు చేరాయని, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడ ఉన్నాయన్నారు. దీంట్లో చేరితో వినియోగదారులకు నష్టంలేదని, ఏదో కొలంబస్ మాదిరిగా వాస్కో డిగామా తరహాలో కొత్తది కనిపెట్టినట్టు పేపర్లు సభలో చూపించారన్నారు. ఇప్పటికైనా ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తే మీడియా సంస్ధలు తమ వైఖరి మానుకోవాలని హితవు పలికారు. స్మార్ట్ మీటర్ల పేరిట రైతులకు ఉరి వేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, తనకిష్టమైన ప్రైవేటు సంస్ధలకు విద్యుత్ పంపిణీ వ్యవస్ధను కట్టబెట్టేందుకు రేవంత్ కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.