13 July, 2026 | 7:03 PM

కాంగ్రెస్‌లోకి గద్వాల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

06-07-2024 12:22 PM

హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే  కారు దిగి కాంగ్రెస్ చేయి పట్టుకునేందుకు రెడీ అయ్యాడు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చేరికను సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో అధిష్టానం పెద్దలు సరితను బుజ్జగించే పనిలో పడ్డారు.