5 August, 2026 | 10:39 AM

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

21-06-2024 04:36 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని జూలై 7 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కవిత ప్రస్తుత జ్యుడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగియడంతో, సీబీఐ అధికారులు ఆమెను శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు కస్టడీని పెంచింది. మద్యం పాలసీ కేసులో కవితను ఈడీ అధికారులు మార్చిలో అరెస్టు చేయగా, ఆ తర్వాత సీబీఐ కూడా ఆమెను కస్టడీలోకి తీసుకుంది. గత నాలుగు నెలలుగా ఆమె తీహార్ జైలులో ఉన్నారు.