17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

బీజేపీతో పొత్తు వద్దనేదే నా తాపత్రయం: ఎమ్మెల్సీ కవిత

30-05-2025 02:25 PM

అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టిందెవరు?

హైదరాబాద్: బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలవడమంటే లిక్కర్ నేరాన్ని అంగీకరించినట్లవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) అన్నారు. గురువారం నాడు సొంత పార్టీ నేతలపై కవిత విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కవిత మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. మంచిర్యాలకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికారు. నస్పూర్ లో కార్యకర్తలు కందుల ప్రశాంత్, శశి ఇంటికి కవిత వెళ్లారు. సీసీసీ నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాల వేశారు. ఈ సందర్భంగా పార్టీని కాపాడుకోవాలనే తన తాపత్రయం అన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే.. ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. పదేళ్లుగా ఎంతో ఆవేదనతో ఉన్నానని చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ, పీవీ వర్థంతులను తొలుత నిర్వహించింది జాగృతేని కవిత గుర్తుచేశారు. యువతకు అవకాశం కల్పిచాలనేదే తన తాపత్రయం అన్నారు. సింగరేణి ప్రాంతంలోని జాగృతిలో యువతకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

నేను జైలులో ఉన్నప్పుడే బీజేపీతో కలవాలనే ప్రతిపాదన వస్తే వ్యతిరేకించానని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు భవిష్యత్ లేదని కవిత సూచించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ను కలుద్దామనుకున్నా.. ప్రతిసారీ ఆయన ప్రజలతోనే ఉంటారని వివరించారు. పార్టీ నుంచి తనను బహిష్కరిస్తారని అనుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు ఆలోచించుకోవాలని వెల్లడించారు. అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టిందెవరు? అని కవిత ప్రశ్నించారు. ఇవన్నీ అంగర్గతంగా జరిగినవే అన్నారు. వాస్తవాలను గుర్తించాలనేదే నా ఆలోచన కవిత స్పష్టం చేశారు.