12 June, 2026 | 1:52 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలి

28-11-2025 12:47 AM

మఠంపల్లి, నవంబర్ 27: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని బిఆర్‌ఎస్ పార్టీ రాష్ర్ట నాయకులు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గురువారం బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన విఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారన్నారు. .అదే తెలంగాణ ఏర్పాటుకు కీలకమలుపు అయింది అన్నారు. ఆరు దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం తొలిసారి అధికారికంగా ప్రకటించిందన్నారు. మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు ఆమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ కె.ఎల్.ఎన్.రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు,మాజీ సర్పం మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామాల పార్టీ అధ్యక్షులు,మహిళా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.