calender_icon.png 1 January, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ మేడ్చల్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ పార్టీ నేతలు

31-12-2025 01:47:31 AM

మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 30 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సుధాంశ్‌ను బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ మాజీ బిఆర్‌ఎస్ పార్టీ కోఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి మాట్లాడుతూ పూడూరు కిష్టాపూర్ కార్పొరేషన్ డివిజన్ లలోని వివిధ సమస్యలపై డిప్యూటీ కమిషనర్ తో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మెరుగు మోహన్ రెడ్డి, మిరుదొడ్డి విఠల్, తుమ్మల రవి, గడ్డం రాజు పూడూరు గ్రామ నాయకులు శేఖర్ రెడ్డి, వెంకటేష్, కృష్ణ పాల్గొన్నారు.